లావణ్య త్రిపాఠీ ‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత గీతాఆర్ట్స్ లో చేస్తున్న మూడో చిత్రం ‘చావు కబురు చల్లగా’. లావణ్యా త్రిపాఠీకి “కౌశిక్ ఈ కథ చెబుతున్నప్పుడు కొత్తగా అనిపించడంతో సగం వినగానే నటించేందుకు ఒప్పుకుందని చెప్పింది. ప్రతి మనిషికీ చావు తప్పుదు. అది వచ్చినప్పుడు బాధపడడం ఎందుకు? అనే పాయింట్‌తో సినిమా ఉంటుంది. ఇందులో లావణ్య భర్తను పోగొట్టు కున్న అమ్మాయిగా నటిస్తుంది. మూవీలో కార్తికేయ తనని ప్రేమిస్తుంటాడని, వితంతువును ప్రేమించడం పెళ్లిచేసుకోవడం తప్పుకాదని, ఈ కథ బాగా నచ్చి నటించడానికి ఆసక్తి చూపానని తెలిపింది. ఇప్పటివరకు ఏ హీరొయిన్ చేయని పాత్రలో నటిస్తుంది లావణ్య. కార్తికేయ, లావణ్య జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘చావు కబురు చల్లగా’ ఈ 19న విడుదలవుతోంది.