Kumbha movie : ప్రముఖ దర్శకుడు వి సముద్ర స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కుంభ’. ఈ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. విజయ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆరు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానంలో జరిగిన ఈ ముహూర్తం వేడుకలో హీరో విజయ్ రామ్‌పై ముహూర్తపు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్టగా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి చంద్రమహేష్, దేవి ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా వి సముద్ర మాట్లాడుతూ, “బలమైన కథలను నమ్ముకుని కొత్త వాళ్లతో 5 సినిమాలు చేస్తున్నాను. అందులో ‘కుంభ’ చిత్రం ఒకటి. నా సినిమాలకు పని చేసే టీమ్‌తోనే ‘కుంభ’ ప్రాజెక్టు చేస్తున్నాను. ‘కుంభ’తో పాటు ‘వరద రాజు గోవిందం’, ‘రామ జన్మభూమి’, ‘ఇండియా సీఈఓ’, ‘ప్రొడక్షన్ నెం 5’ వంటి సినిమాలు కూడా ఆరు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాలుగా చేయబోతున్నాను. వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెరకెక్కే ఈ ప్రాజెక్టులను ప్రకటించడం ఆనందంగా ఉంది” అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వరంగల్ శ్రీను మాట్లాడుతూ, “వి సముద్ర చేసినవి అన్ని హిట్ టైటిల్సే. ఆయన ప్రతి సినిమా ప్రతి ఊరిలో చెప్పుకుంటారు. ఆయన సినిమాలోని పాటలు సందర్భోచితంగా ఉంటాయి. సముద్ర గారి సినిమాకు పని చేయడం నా అదృష్టం” అని అన్నారు.

హీరో విజయ్ రామ్, సముద్ర త‌న‌కు అవకాశం ఇవ్వడం సంతోషంగా, గర్వంగా ఉంద‌ని అన్నారు. ఆధ్యాత్మికవెత్త రాజు చిత్ర యూనిట్‌కు దేవదేవతల ఆశీర్వాచనాలు అందజేశారు. కన్నా దేవరాజ్ సముద్ర సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి, ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుందని భరోసా వ్యక్తం చేశారు. ఈరోజు శ్రావణ గురువారం రోజున పురస్కరించుకొని మా పిల్లల సినిమా స్క్రిప్ట్ పూజ ఈ సందర్భంలో జరుపుకోవడం జరిగింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మా పిల్లల సినిమాని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని వి.సముద్ర తెలిపారు.

Leave a comment

error: Content is protected !!