Kubera movie : ప్రముఖ నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “కుబేర”. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర హీరో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన నాగార్జున ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది.

తాజాగా, రామోజీ ఫిల్మ్‌సిటీలో గుడి నేపథ్యంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఈ సన్నివేశాలలో ధనుష్ తో పాటు రష్మిక మందన్న, జిమ్‌ సర్బ్‌ తదితర నటులు పాల్గొన్నారు. “కుబేర” చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రై.లి బ్యానర్లపై సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!