Krithishetty : అందాల కృతి శెట్టి ప్రస్తుతం పరాజయాలతో తన జెర్నీని కంటిన్యూ చేస్తోంది. ఆమె రీసెంట్ తెలుగు మూవీ “మనమే”. ఇందులో ఆమె శర్వానంద్ కు జోడీగా నటించింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నమోదు అయింది. దీంతో మరోసారి బేబమ్మకి నిరాశ తప్పలేదు.

అయితే .. ఆమెను వరుసగా ఫ్లాపులు చుట్టుముడుతున్నా, ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ సరసన రానా దగ్గుబాటి నిర్మించనున్న కొత్త చిత్రానికి ఆమె సంతకం చేసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆమె మరో యువ తెలుగు నటుడు నటించే చిత్రం కోసం కూడా చర్చలు జరుపుతోంది. చాలా గ్లామరస్ గా ఉండే కృతి శెట్టి “ఉప్పెన”లో అద్భుతమైన అరంగేట్రం చేసింది. కేవలం రెండు సంవత్సరాలలో ఆరు చిత్రాలలో కనిపించి వరుస విజయాలను అందుకుంది.

“ది వారియర్,” “మాచర్ల నియోజకవర్గం,” “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి,” “కస్టడీ” మరియు “మనమే” సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. ఆమెకు ఇప్పుడొక హిట్ కావాలి. ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, ఒక మలయాళం సినిమాలో నటిస్తోంది. తెలుగులోనూ ఆమెకు కొత్త ఆఫర్లు వస్తున్నాయి.

Leave a comment

error: Content is protected !!