కథ ఒకరి దగ్గరకు వెళితే సినిమా మరొకరు చేయడం ఇండస్ట్రీలో క్వైట్ కామన్. అలా మిస్ అయిన సినిమా సూపర్ హిట్టయితే మాత్రం కొందరు బాధపడతారు. యంగ్ బ్యూటీ శివానీ రాజశేఖర్ అలాంటి సిట్యువేషన్ ను ఫేస్ చేసిన అమ్మాయే. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన సినిమా కథ ముందు తన దగ్గరకే వచ్చిందట. తనకు నేరేషన్ ఇచ్చేటప్పుడు తనకు చెప్పిన కథలో చాలా బోల్ట్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని, ఆ టైమ్ లో తను ఆ సీన్స్ చేయడానికి కన్విన్స్ అవ్వలేదని, తనకు అలా ఇంటిమేట్ సీన్స్ చేయడం కంఫర్టబుల్ అనిపించలేదని చెప్పింది. ఆ కారణంతో తాను బేబమ్మ పాత్ర చేయలేనని చెప్పగా అది అటు తిరిగి ఇటు తిరిగి కృతి శెట్టి దగ్గరికి వెళ్లిందని చివరికి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకొచ్చింది. తనకు ఫైనల్ వెర్షన్ వినిపించి ఉంటే బహుశా చేసి ఉండే దాన్నేమో అలా చేసి ఉంటే తన కెరియర్ మరోలా ఉండేదేమో అని ఆమె కామెంట్ చేసింది.