టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ లేటెస్ట్ గా “కృష్ణమ్మ” మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ పంపిణీ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు నిర్మాణ భాగస్వామ్యం వహించాయి. ఈ చిత్రం మే 10న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా “కృష్ణమ్మ” థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని ఆవిష్కరించారు.

యాక్షన్ అండ్ ఎమోషనల్ అంశాలతో నిండిన ఈ ట్రైలర్.. కృష్ణా ప్రాంతాన్ని నేపథ్యంగా కలిగి ఉన్న కథాంశానికి ఎలివేట్ చేస్తుంది. నిరపరాధులైన ముగ్గురు స్నేహితులు తీవ్రమైన పరిస్థితుల్లో చిక్కుకున్న కథ. ఉత్కంఠతను రేకెత్తించే యాక్షన్ సన్నివేశాలు, ఫ్రెండ్ షిప్ గొప్పతనాన్ని చాటి చెప్పే కథనం ఈ సినిమా హైలైట్స్ . కాల భైరవ సంగీతం ఈ సినిమాని మరో మెట్టుపై నిలబెడుతుందని చెప్పాలి.

లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన ఐయర్, రాఘు కుంచె, నందగోపాల్ ముఖ్యపాత్రలు పోషించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌లో కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన అతిర రాజ్ కీలక పాత్రలో నటించారు.

Leave a comment

error: Content is protected !!