మూవీ : కృష్ణారామా
మూవీ క్యాస్ట్ : రాజేంద్ర ప్రసాద్,గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, జెమిని సురేష్, రచ్చ రవి, రవి వర్మ తదితరులు..
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
సినిమాటోగ్రఫీ: రంగనాథ్ గోగినేని
మ్యూజిక్: సునీల్ కశ్యప్
నిర్మాతలు: వెంకట కిరణ్, హేమ మాధురి
సహా నిర్మాతలు: ఉమామహేశ్వర్ చదలవాడ, శ్రీదేవి కళ్ళకూరి, సందీప్ ఐనంపూడి
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాజ్ మాదిరాజు
బామ్మ మాట బంగారు బాట మూవీ సూపర్ హిట్ పెయిర్ రాజేంద్ర ప్రసాద్ , గౌతమి కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఓటిటి మూవీ ‘కృష్ణారామా’. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ సినిమాకు రాజ్ మదిరాజు దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 22న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులని అలరించిందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం
కథ : రామతీర్థ (రాజేంద్ర ప్రసాద్), కృష్ణవేణి (గౌతమి) వీరిద్దరు రిటైర్డ్ టీచర్లు. తమ ముగ్గురు పిల్లలని బాగా చదివించి ఫారిన్ లో సెటిల్ చేసింటారు.. ఐతే వారి ఉద్యోగరిత్యా వీరిని కలవడం మాట్లాడటం రామతీర్థ, కృష్ణవేణి కి చాల ఇబ్బందిగా మారింటుంది. ఈ క్రమం లో వీరు పిల్లలకి దగ్గరవ్వడం కోసం కృష్ణారామా అనే ఫేస్ బుక్ పేజ్ ని క్రియేట్ చేస్తారు. ఇందులో సక్సెస్ అవ్వడమే కాదు సెలబ్రిటీస్ గా కూడ మారతారు.. అసలు చిక్కు ఇక్కడే వస్తుంది. ఈ సోషల్ మాధ్యమం వల్ల వీరు సూసైడ్ కి కూడ ప్రయత్నిస్తారు.అనుకున్నది ఒకటి జరుగుతోంది మరొకటి….మరి ఇలాంటి సిచువేషన్స్ నుంచి కృష్ణారామా ఎలా బయట పడి పిల్లలకు ఎలా దగ్గరయ్యారనేదే స్టోరి .
విశ్లేషణ : ఇది తల్లిదండ్రుల కథ. చాలా మంది పేరెంట్స్ ఖచ్చింతంగా కనెక్ట్ అయ్యే కథ.పిల్లలకి దూరంగా ఉండే తల్లిదండ్రులు పడే మనోవేదన ఇందులో కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న సోషల్ మాధ్యమాల వల్ల పిల్లలకి దగ్గరవ్వాలని చేసే ప్రయత్నం ఓ వైపు నవ్విస్తూనే …మరో వైపు ఓ అలోచనని రేకెత్తిస్తాయి. కంప్లీట్ ఫ్యామిలి చూడదగ్గ సినిమా ఇది. పిల్లలు పెద్దలు కలిసి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఓ మార్పు తీసుకొచ్చే అవకాశం ఉన్న చిత్రం.
నటి నటులు పెర్ఫామెన్స్: రాజేంద్రప్రసాద్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఒక వైపు కామెడి తో పాటు , మరో వైపు ఎమోషన్ కూడా బాగా పండించ గలిగారు. ఇక గౌతమి క్యారెక్టర్ బాగా సూట్ అయ్యింది. ఈ ఇద్దరి పెయిర్ బాగుంది. ఈ సినిమాలో మరో మెయిన్ రోల్ అనన్య శర్మ. 30 వెడ్స్ 21 తో ఆడియన్స్ కి బాగా దగ్గరైన అనన్య ఈ మూవీ తో కూడ మెప్పించింది.
బోటమ్లైన్ : ఆలోచింపజేసే ‘కృష్ణారామా’
గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే