Konidela Surekha : ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు, రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వదినమ్మ కొణిదెల సురేఖ నుండి ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. పవన్ అన్నయ్య.. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని ఒక వీడియో రూపంలో X హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. పవన్, సురేఖ అనుబంధానికి ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది.

వీడియోలో.. సురేఖ పవన్‌కి మిక్కీ మౌస్ లోగోతో కూడిన నోట్‌ప్యాడ్‌తో పాటు వాల్ట్ డిస్నీ మాంట్‌బ్లాంక్ పెన్ ప్రత్యేక ఎడిషన్‌ను బహుమతిగా ఇచ్చారు. వదినమ్మ ను పవన్ ఆప్యాయంగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. చిరు, సురేఖ నుంచి పవన్‌కు ప్రత్యేక సందేశం ఇవ్వడంతో వీడియో ముగిసింది. “తెలుగు ప్రజలందరి ఆశలు మరియు ఆకాంక్షలు నెరవేరాలని మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలతో – వదిన, అన్నయ్య” అని సందేశం ఉంది. పవన్ భార్య అన్నా లెజ్నెవా కూడా వారితో పోజులివ్వడాన్ని వీడియోలో చూడవచ్చు.

ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ చిరు స్పెషల్ వీడియో బైట్ విడుదల చేశారు. మరోవైపు సురేఖ తన కుమారుడు స్టార్ హీరో రామ్ చరణ్‌తో కలిసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసింది. కొద్దిరోజుల క్రితం అమరావతిలో జరిగిన పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా ఘనంగా హాజరయ్యారు.

Leave a comment

error: Content is protected !!