టైటిల్: కోనసీమ తగ్స్
క్యాస్ట్: బాబీ సింహ, ఆర్కే సురేష్, మునీష్ కాంత్, అనశ్వర రాజన్, శరత్ అప్పాణి, పీఎల్ తేనప్పన్, హ్రిదు హారన్ తదితరులు….
మ్యూజిక్ డైరెక్టర్: శ్యామ్ సి ఎస్
సినిమాటోగ్రాఫర్: బృంద
ఎడిటర్: ప్రవీణ్ యాంటోని
బ్యానర్: హెచ్ ఆర్ పిక్చర్స్ అసోసియేషన్ & జియో స్టూడియోస్
ప్రొడ్యూజర్స్: రియా శిబు, ముంతాస్ ఎమ్
తెలుగు రీలిజ్ బై: మైత్రి మూవీ మేకర్స్
రైటర్ & డైరెక్టర్: బృంద
బృందా గోపాల్ డైరెక్షన్ లో హిద్రు హరున్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం కోనసీమ థగ్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సింహ, ఆర్.కె.సురేష్, మునీష్ కాంత్, అనస్వర రంజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయి లో ఈ వారం విడుదలైంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం…!!
కథ: కాకినాడ లో ‘పెద్దిరెడ్డి’(పీఎల్ తేనప్పన్) అనే ఒక యజమాని దగ్గర హీరో శేషు(హ్రిదు హారన్) గుమస్తా గా పని చేస్తాడు. శేషు ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి కోయల(అనశ్వర రాజన్)ని, పెద్దిరెడ్డి అనుచరుడు ‘కాళీ’, కొడుకు ‘భద్ర’ హీరోయిన్ వెంటపడి టార్చర్ చేస్తుంటాడు. దాంతో, శేషు అనుకోకుండా భద్ర ని చంపి, పెద్దిరెడ్డి కి సంబంధించిన డాక్యుమెంట్స్, డబ్బు తీసుకొని శేషు, కోయల కలిసి పారిపోతారు. కట్ చేస్తే, శేషు జైలు లో ఉంటాడు. అసలు జైలు కి ఎవ్వరు తీసుకొని వచ్చారు? బాబీ సింహ పాత్ర ఏమిటి? పెద్దిరెడ్డి డాక్యుమెంట్స్, డబ్బు తీసుకువెళ్లాలిసిన అవసరం ఏం వచ్చింది? ఇంతకీ జైలు నుంచి భయటపడ్డాడా లేదా అనేది తెలియాలి అంటే మీరు కచ్చితంగా సినిమా చుడాలిసిందే?
కధనం, విశ్లేషణ:
గతంలో జైలు బ్యాక్డ్రాప్ సినిమాలు చాలానే వచ్చాయి. సబ్జెక్ట్ పాతదే అయ్యిన యాక్షన్ & సస్పెన్స్ మూడ్ ని బాగా క్యారీ చేసారు దర్శకురాలు ‘బృంద’. ఓపినింగ్ సీన్ లోనే హీరో హ్రిదు హారన్ ని జైలు కి తీసుకువెళ్తున్నప్పుడు తన వేషధారణ అండ్ లుక్స్ తో ప్రేక్షకులని భయబ్రాంతులని చేసాడు. ఇక, జైలు కి వెళ్ళాక అక్కడ గ్యాంగ్ తో తలపడే ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తాయి. జైల్లో హీరో హ్రిదు హారన్ గ్యాంగ్ ని ఫార్మ్ చేసుకొని, బాబీ సింహ హెల్ప్ తో తప్పించుకొని పారిపోవడానికి సన్నాహాలు చేస్తారు. అక్కడక్కడ మునీష్ కాంత్ తో సాగే కామిడి ఆకట్టుకుంటుంది. జైల్లో సబ్ఆర్డినేటర్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఆర్కే సురేష్ యాక్టింగ్ నెస్ట్ లెవల్. హ్రిదు హారన్ కి పరిచయమైన దొర(బాబీ సింహ) జైలు కి రావడానికి గతంలో జరిగిన ఆ బాధాకరమైన సంఘటన ఏంటి? హ్రిదు హారన్ & దొర(బాబీ సింహ) ఇద్దరు కలిసి ఏం చేసారు? సినిమా ప్రీ క్లైమాక్స్ 10మినిట్స్ సినిమాని వేరే స్థాయిలో నిలబెట్టింది.
మ్యూజిక్, యాక్టర్స్, సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలాలు. అక్కడక్కడ సాగే కామిడి పర్వాలేదు అనిపించిన, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసారు డైరెక్టర్ బృంద. ఈ సినిమా చూస్తున్నంత సేపు కథ రియాలిటీ కి చాలా దగ్గర గా అనిపిస్తుంటుంది. ఓవర్ ఆల్ గా సినిమా చూడవచ్చు
నటి నటుల పెర్ఫామెన్స్: బాబీ సింహ సినిమా మొత్తానికి పెద్ద అసెట్. కొన్ని సీన్స్ లో సింహ చేసిన పెర్ఫామెన్స్ కి ఫిదా అవ్వాలిసిందే. హీరోయిన్ అనశ్వర రాజన్ స్క్రీన్ మీద కనిపించినంత సేపు ఆడియెన్స్ ని తన వైపుకి తిప్పుకుంది. అటు యాక్టింగ్ తో పాటు గ్లామర్ ని కూడ టచ్ చేస్తు తన ప్రతిభను కనబర్చింది. హీరో హ్రిదు హరూన్ అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆల్ రౌండర్ గా ప్రేక్షకుల ప్రసశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా, కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు, సస్పెన్స్ సీక్వెన్స్ లు చాలా ఇంటెన్స్డ్ గా యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆర్కే సురేష్, మునీష్ కాంత్ తదితరులు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం: కొరియోగ్రాఫర్ గా బృంద తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయస్తులు. గతంలో హే సినామిక సినిమాతో డైరెక్టర్ గా తెరగేట్రం చేసి చేతులు కాల్చుకుంది. మరలా, ఇప్పుడు కోనసీమ తగ్స్ తో అటు డైరెక్టర్ & సినిమాటోగ్రాఫర్ గా మొదటి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. కొద్దీ పాటి సన్నివేశాలు తప్ప, యాక్షన్ & సస్పెన్స్ ని క్యారీ చేయడం లో సూపర్బ్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన శ్యామ్ సి ఎస్ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రాఫర్ బృంద విజ్యువల్స్ అద్భుతంగా ఇచ్చారు. ప్రవీణ్ యాంటోని ఎడిటింగ్ చాలా చక్కగా ఉంది. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సట్రాడినరీ గా ఉన్నాయి.
రేటింగ్: 3.5/5
బాటమ్ లైన్: యాక్షన్ & సస్పెన్స్ తో సాగే “కోనసీమ తగ్స్”
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్