KA teaser : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న “క” సినిమా ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. కిరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులలో మంచి ఆసక్తి క్రియేట్ అయింది. ఈ చిత్రం 1970 నేపథ్యంలో ఒక పోస్ట్ మ్యాన్ పాత్రలో కిరణ్ అబ్బవరం కనిపిస్తాడు. టీజర్ లో కిరణ్ గతం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించేలా ఉంది. యాక్షన్ దృశ్యాలు ప్రేక్షకులను ముగ్ధులను చేశాయి.

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మేకోవర్ చాలా బాగుంది అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. తాన్వి రామ్ మరియు నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ అండ్ సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన చిత్రం. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. “క” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో మైలురాయి గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!