ఈ సినిమా నుంచి అన్‌లిమిటెడ్ కామెడీ అందిస్తున్నానంటున్నాడు కిరణ్ అబ్బవరం. నేహాశెట్టితో రొమాన్స్‌ చేస్తూ.. కిరణ్‌ అబ్బవరం లేటెస్ట్ ఔట్‌ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌ రూల్స్‌ రంజన్‌. స్టార్‌లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రత్నం కృష్ణ డైరెక్షన్‌లో ఏఎం రత్నం సమర్పిస్తున్న రూల్స్ రంజన్‌ అక్టోబర్‌ 6 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం పాత్రికేయులతో ముచ్చటించారు.

ఈ సినిమా టైటిల్‌లో రూల్స్ ఉందని ఇదేదో సీరియస్ స్ట్రిక్ట్‌ సినిమా కాదు..కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ.. రెండున్నర గంటలు ప్రేక్షకులు నవ్వుకునేలా సినిమాను రెడీ చేసాం అన్నారు కిరణ్ అబ్బవరం. ఇంతకు ముందు సినిమాల్లో సబ్జెక్ట్‌, డ్రామా ఎక్కువగా ఉండేది.. ఈ సినిమాలో డ్రామా కంటే కామెడీ ఎక్కువగా ఉంటుంది.. ట్రైలర్‌ చూసి ఎంత నవ్వుకున్నారో అంతకు రెట్టింపు సినిమా చూసి నవ్వుకుంటారని నమ్మకం ఉందన్నారు.

ఫస్ట్‌ టైమ్‌ వెన్నెల కిశోర్‌ , హైపర్ ఆది లాంటి కమెడియన్స్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకున్నానన్నారు కిరణ్ అబ్బవరం. సాఫ్ట్‌గా ఉండే కుర్రాడు.. తనను కంట్రోల్ చేస్తున్న వ్యక్తులపై ఎలా రూల్స్ పెట్టాడు.. మనోరంజన్‌ గా సాగుతున్న వ్యక్తి జీవితంలో ఓ అమ్మాయి ఎంట్రీతో ఎలా రూల్స్‌ రంజన్‌ గా మారాడో చాలా వినోదాత్మకంగా సాగుతుందన్నారు హీరో కిరణ్ అబ్బవరం.

ఈ సినిమాలో నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేసాను.. రియల్‌ లైఫ్‌ లో కూడా నేను చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జాబ్ చేసాను.. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఆనాటి రోజులు గుర్తొచ్చాయన్నారు కిరణ్ అబ్బవరం.

ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు, వైవా హర్ష, హైపర్ ఆది, మెహర్ చాహల్, అజయ్, మకరంద్ దేశ్‌పాండే, అతుల్ పర్చురే, అన్నూ కపూర్ మరియు అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటించారు.

Leave a comment

error: Content is protected !!