చిత్రం : ‘క ‘
విడుదల తేదీ: 31–10–2024
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్‌కుమార్, రెడిన్ కింగ్‌స్లే తదితరులు
సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్, సతీశ్‌రెరెడ్డి సంగీతం: సామ్ సీఎస్
ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్
నిర్మాత: చింతా గోపాలకృష్ణ
రచన, దర్శకత్వం: సుజీత్ – సందీప్.
కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో మరో విభిన్న ప్రయత్నంగా నిలిచిన చిత్రం ‘క’. పలు పరాజయాల తర్వాత తనను తాను నిరూపించుకోవడానికి చేసిన ఈ చిత్రం, దర్శకులైన సుజీత్ మరియు సందీప్ కలయికలో వచ్చింది. ఈ సినిమా కథ, నటన, సాంకేతిక విలువలు, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం..
కథ:
‘క’ సినిమా కథ 1980ల నేపథ్యంలో సాగుతుంది. అనాథ అయిన అభినయ్ (కిరణ్ అబ్బవరం) తన తల్లిదండ్రులను వెతుకుతూ క్రిష్ణగిరి అనే మారుమూల పల్లెకు చేరుకుంటాడు. అక్కడ అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్న సంఘటనలు చూసి వాసుదేవ్ ఆ కేసును ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొనే సమస్యలు, ఆయన జీవితంలోకి వచ్చే మలుపులు ఏమిటన్నది మిగతా కథ.
విశ్లేషణ :
1980ల నేపథ్యంలో సాగే ఈ కథ ఇప్పటి వరకు రాలేని విధంగా ఉంది. క్లైమాక్స్ 20 నిమిషాలు ఊహించని రీతిలో ఉంటుంది. తల్లి గర్భానికి, ఓ చీకటి గదికి, అంతర ఆత్మకు లింక్ చేసిన ఆ ఒక్క పాయింట్ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.మనిషి పుట్టుక, కర్మ, దాని పర్యావసానం రుణాను బంధాలకు ముడివేసి దర్శకులు రాసిన ఈ కథ సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తుంది.
నటీ నటుల పెర్ఫార్మన్స్ :
సినిమాలో కిరణ్ అబ్బవరం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఓ ప్రయోగం చేశారు. గ్రే షేడ్స్ చూపించడంలో ఆయన సఫలమయ్యారు. సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. కథానాయిక నయన సారిక 1980ల అమ్మాయిలా ఆకట్టుకుంది. తన పాత్రకు న్యాయం చేసింది. కీలకమైన పాత్రలో నటించిన తన్వి రామ్ తన పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక విలువలు:
1970-80ల ప్రాంతానికి తీసుకెళ్లేలా కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది.సామ్ సి.ఎస్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎసెట్. ప్రతి పాట కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు.
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగింది. కామెడీ అంత గా వర్కవుట్ కాలేదు.
ప్లస్ పాయింట్స్ :
కిరణ్ అబ్బవరం నటన, స్క్రీన్ ప్లే, సంగీతం
‘మొత్తం మీద ‘క’ సినిమా ఒక విభిన్న ప్రయోగం. కొత్త కథ, నటన, సాంకేతిక విలువలు మరియు కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే, ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌కు మంచి జోరునిస్తుందని చెప్పవచ్చు. కొత్త జానర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది.
బోటం లైన్ : వినూత్న ప్రయోగం ‘క ‘
రేటింగ్ : 3/5