Kicha Sudeep : ఈ సంక్రాంతికి ‘హను-మాన్‌’తో అద్భుత విజయం సాధించిన తర్వాత ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ .. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ నటిస్తున్న ఈ సినిమా పేరు ‘బిల్లా రంగ బాషా’. దర్శకుడు అనూప్‌ భండారి. ‘విక్రాంత్‌ రోణ’ తర్వాత సుదీప్‌తో మరోసారి చేతులు కలుపుతున్నాడు ఈ దర్శకుడు.

సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కాన్సెప్ట్‌ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌ ప్రకారం ఈ సినిమా కథ 2209 సంవత్సరంలో జరుగుతుంది. ది స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ, ఈఫిల్‌ టవర్, తాజ్‌మహల్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధ స్మారక చిహ్నాలు నాశనమైనట్లు చూపించడం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆఖరికి, ఒక వ్యక్తి వాటన్నింటినీ జయించినట్లు చూపించడం ఈ సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని తెలియజేస్తోంది.

Leave a comment

error: Content is protected !!