భోళా శంకర్ చిత్రం తో చిరంజీవి త్వరలోనే ఆడియన్స్ ముందుకి రానున్నారు. ఈ చిత్రం టైటిల్ చిత్ర యూనిట్ , చిరంజీవి బర్త్ డే సంధర్బంగా అనౌన్స్ చేసారు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ అజిత్ వేదాలం సినిమాకి ఈ చిత్రం రీమేక్.

      చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్ అందువల్లే నేమో శంకర్ పేరు ని మెగాస్టార్ రిపీటెడ్ గా తన సినిమాల్లో వాడుతున్నారు. దాదాపు శంకర్ పేరు తో వచ్చిన చిరంజీవి సినిమాలు , సినిమాల్లో పాత్రల పేర్లు దాదాపు అన్ని సూపర్ హిట్లే. ఖైదీ నంబర్ 150 , శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ , ఇంద్ర లో శంకర్ నారాయణ ఇలా చాల సార్లు ఈ శంకర్ పేరు ని రీపీట్ చేసారు చిరంజీవి. లేటెస్ట్ గా భొళా శంకర్ తో మరోసారి ఈ పేరు ని రిపీట్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ మెహర్ రమేష్. శక్తి , షాడో లాంటి భారీ డీజాస్టర్స్ తర్వాత దాదాపు 8 ఏళ్ళు ఒక్క చిత్రం కూడ చేయలేదు మెహర్ రమేష్. ఇలాంటి వరుస ఫ్లాప్ లు తీసిన డైరెక్టర్ తో సినిమా చేయాలంటే ఓ మేరకు భయపడతారు కానీ మెగా స్టార్ మాత్రం మెహర్ రమేష్ టాలెంట్ ని నమ్మి భోళా శంకర్ చిత్రానికి అవకాశం ఇచ్చారు. రీమేక్ ఐనప్పట్టికి ఇలాంటి అవకాశం ఇవ్వాలంటే అంత సులభమేమి కాదు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ అవకాశాన్ని మెహర్ రమేష్ ఎంతవరకు ఉపయోగించుకుంటారో…

కలకత్తా బ్యాక్డ్రాపు లో ఈ చిత్రం నిర్మించ బడుతోంది. అల్రెడి కలకత్తా బ్యాక్డ్రాప్ తో వచ్చిన చూడలని ఉంది బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సో ఆ సెంటిమెంట్ కూడ ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యింది. ఇదే టైటిల్ తో 1984 లో దాసరి నారాయణ రావూ భొళా శంకరుడూ అనే చిత్రాన్ని రూపొందించారు . అందులో దాసరి మెయిన్ లీడ్. ఈ చిత్రం లో చిరంజీవి కి చెల్లెలు గా మహనటి తో మెప్పించిన కీర్తి సురేష్ యాక్ట్ చేస్తోంది. కీర్తి సురేష్ మదర్ మేనక చిరంజీవి తో 1980 లో పున్నమి నాగు లో కలిసి యాక్ట్ చేసింది. ఈ రోజు మేనక కూతురు ఈ భోళా శంకర్ చిత్రం లో చెల్లెలు గా యాక్ట్ చేస్తోంది. 

Leave a comment

error: Content is protected !!