రాధికా ఆప్టే.. బోల్డ్ పాత్రను కూడా బోల్డంత ఇష్టంతో చేసే నటీమణి. మరి కీర్తి సురేశో.. ఎలాంటి పాత్రకైనా కీర్తి తెచ్చిపెట్టాలనుకునే మహానటీమణి. టాలెంట్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన ఈ ఇద్దరూ కలిసి నటిస్తే అదుర్స్ కదూ. అయితే అది సినిమా కాదులెండి. వెబ్ సిరీస్. పేరు అక్క. ఆదిత్య చోప్రా నిర్మాతగా ధర్మరాజ్ శెట్టి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు. రాధికా ఆప్టే లాంటి అక్క ఉన్న కీర్తి సురేశ్ లాంటి అమ్మాయి.. ఆమె కోసం ఏం చేసిందన్నదే ఈ వెరైటీ పీరియాడికల్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సిరీస్ కథ. మరి ఆ అక్క కోసం ఈ చెల్లెలు ఏం చేసిందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!