ఈమధ్య కాలంలో పొడుగు టైటిల్స్‌తో సినిమాలు తీస్తున్నారు మేకర్స్‌. వాటిని పొడి అక్షరాల్లో పిలుచుకుంటారు ప్రేక్షకులు. అలాంటి పొడి అక్షరాల టైటిల్స్‌లో ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్‌ అయ్యింది KCPD. గాడ్‌ఫాదర్ సినిమాలో కూడా మెగాస్టారే ఈ KCPD ని వాడుకున్నారు. ఇప్పుడు ఇదే ఓ కొత్త సినిమాకు టైటిల్‌ గా మారింది. KCPD అంటే కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్‌. ఈ చిత్రంలో రామిడి శ్రీరామ్‌ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ యంగ్ హీరో బర్త్‌డే సందర్భంగా రొమాంటిక్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌.
KCPD (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్) చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ ను జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ను వేలెంటైన్స్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసారు. ఈ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు యంగ్ డైనమిక్‌ హీరో శ్రీరామ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ రొమాంటిక్‌ ఫస్ట్‌లుక్‌ ను రిలీజ్‌ చేసారు.


రామిడి శ్రీరామ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తనీష్‌ అల్లాడి, ద్వారక విడియన్‌ (బంటి), ప్రియాంక నిర్వాణ, దివ్య డిలోల్కర్ లు మిగతా కీలక పాత్రల్లో అద్భుతంగా నటిస్తున్నారని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని కార్తీక్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ సందర్భంగా హీరో శ్రీరామ్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి.

Leave a comment

error: Content is protected !!