సీరియల్ కిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో సినిమాలొస్తున్నాయి? వరుస హత్యలు, పోలీస్‌ డిపార్ట్‌మెంట్ ఇన్విస్టిగేషన్‌ సీన్స్‌, మర్డర్ మిస్టరీ తో సాగే ఉత్కంఠభరిత స్క్రీన్‌ ప్లే ఆడియెన్స్‌ను థ్రిల్‌ చేస్తుంది. ఇలాంటి సినిమాలకు మినిమమ్‌ గ్యారెంటీ సక్సెస్‌ ఉంటుంది. అయితే సినిమా షూటింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వరుస హత్యలు జరగడం, ఇన్విస్టిగేషన్‌తో సాగే స్క్రీన్‌ప్లేతో సినిమా వస్తుంటే ఇంకా ఇంట్రస్ట్‌ ఉంటుంది. అలాంటి సినిమానే కథ వెనుక కథ. టైటిల్‌తోనే సగం క్యూరియాసిటీ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్‌. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజై మరింత బజ్‌ క్రియేట్ చేసింది. కంటెంట్‌లో థ్రిల్‌, విజువల్స్‌లో క్వాలిటీ ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేసాయి. దండ‌మూడి బాక్సాఫీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని దంద‌మూడి అవ‌నీంద్ర కుమార్ నిర్మించారు. చల్‌మోహనరంగా చిత్రంతో దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌ జంటగా నటించారు. సునీల్‌ ఈ సినిమాలో పోలీసాఫీసర్‌ గా కీలక పాత్ర పోషించారు.
ఈ ట్రైలర్‌ ను గమనిస్తే..
హీరోకి డైరెక్టర్‌ కావాలన్న కోరిక ఉంటుంది. మరదలితో ప్రేమాయణం. కండిషన్ పెట్టే మామయ్య. సంవత్సరంలో హిట్‌ సినిమా తీసి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుంటేనే పెళ్లి.. ఇదీ స్టోరీ ప్లాట్‌.. ఈ సినిమా తీసే క్రమంలో యూనిట్ మెంబర్స్‌ మిస్‌ కావడం.. హత్యలకు గురవడం ఇన్విస్టిగేషన్ చేసే ఆఫీసర్‌ గా సునీల్ ఎంట్రీ ఇవ్వడం.. సినిమాలో సినీహీరో ని అరెస్ట్ చేయడం లాంటి సీన్స్‌ తో ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా కట్ చేసారు. సత్య హీరోను ఎందుకు అరెస్ట్‌ చేసారు అనేది సస్పెన్స్‌ పాయింట్‌. ఇది తెలియాలంటే మార్చి 24 వరకు ఆగాల్సిందేనంటున్నారు నిర్మాత దందమూడి అవనీంద్ర.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 24 న రిలీజ్‌ కి సిద్దంగా ఉంది.

క్యాస్టింగ్‌:
విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, ఈరోజుల్లో సాయి, రూప త‌దిత‌రులు

టెక్నిషియన్స్‌:
బ్యాన‌ర్‌: దండ‌మూడి బాక్సాఫీస్‌
నిర్మాత‌: అవ‌నీంద్ర కుమార్‌
స్టోరి, డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శక‌త్వం: కృష్ణ చైత‌న్య
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయి గొట్టిపాటి
సినిమాటోగ్రాఫ‌ర్స్‌: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, ఈశ్వర్‌
ఎడిట‌ర్‌: అమ‌ర్ రెడ్డి కుడుముల‌
మ్యూజిక్‌: శ్రవ‌ణ్ భ‌రద్వాజ్‌
ఫైట్స్: అంజి, రియ‌ల్ స‌తీష్‌
ఆర్ట్‌: వెంక‌ట్ స‌ల‌పు
కొరియోగ్రఫీ: భాను
లిరిక్స్‌: కాస‌ర్ల శ్యామ్, పూర్ణాచారి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్‌
పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)

Leave a comment

error: Content is protected !!