తాత పృధ్వీరాజ్ కపూర్.. తండ్రి రణధీర్ కపూర్ .. ఈ ఇద్దరి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఒకప్పుడు బాలీవుడ్ లో తన అందంతో , అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించి.. ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది ఆమె. పదిహేడేళ్లకే నటనారంగంలో అడుగుపెట్టిన  ఆమె పేరు కరిష్మా కపూర్. ఎల్డర్ సిస్టర్ ఆఫ్ కరీనా కపూర్. 

1991లో విడుదలైన ‘ప్రేమ్ ‌ఖైదీ’ చిత్రంలో కధానాయికగా అరంగేట్రం చేసింది కరిష్మా. ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. బాలీవుడ్‌లో ఒక దశలో అత్యధిక పారితోషికం తీసుకొన్న నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన ‘రాజా హిందుస్థానీ’ భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ‘దిల్‌ తో పాగల్‌ హై’ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ సహాయనటి అవార్డును అందుకుంది. 2001లో విడుదలైన ‘ఫిజా’, ‘జుబేదా’ చిత్రాల్లో నటనకుగాను ఫిలింఫేర్‌ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకొంది. ఆమె నటించిన ‘అనారీ’, ‘ఆందాజ్‌ అప్నా అప్నా’, ‘బీవీ నంబర్‌ వన్‌’ తదితర చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. 2004లో నటనకు స్వస్తి చెప్పిన ఆమె 2012లో ‘డేంజరస్‌ ఇష్క్‌’ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఆపై షారుఖ్  ‘జీరో’ చిత్రంలో నటించింది . బుల్లితెర నటిగా పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ‘మిరాకిల్స్‌ ఆఫ్‌ డెస్టిని’ ధారావాహికలో అమ్మమ్మ, మనుమరాలి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసింది. నేడు కరిష్మా కపూర్‌ పుట్టినరోజు.   ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!