karthi : గతేడాది ‘జపాన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన కార్తి, ఇప్పుడు కొత్త చిత్రంతో రాబోతున్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ‘వా వాద్యార్’ అనే టైటిల్ పెట్టారు. కేఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.

తాజాగా, ఈ చిత్రం నుండి కార్తి ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. పోలీసు అవతారంలో ఉన్న కార్తి, ఆయన వెనుకాల తమిళ అగ్రనటుడు ఎంజీఆర్‌ వేసిన అనేక గెటప్పులు కనిపిస్తాయి. ఈ ఆసక్తికరమైన పోస్టర్ చిత్రంపై అంచనాలను పెంచుతోంది. కార్తి ఈ చిత్రంలో ఎంజీఆర్ అభిమానిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది . త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

 

Leave a comment

error: Content is protected !!