ప్రస్తుతం స్పోర్ట్స్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ లో తరచుగా తెరకెక్కుతుంటాయి ఈ తరహా చిత్రాలు. అయితే ఇప్పుడిప్పుడే ఈ మేనియా టాలీవుడ్ కు కూడా పాకుతోంది. ఈ నేపథ్యంలో భారత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ కరణం మల్లీశ్వరి బయోపిక్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ అయిన కోనా వెంకట్ ఈ సినిమాను తన ఓన్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఈ సినిమా కు సంబంధించిన అనౌన్స్ మెంట్ తో కూడిన లుక్ ను విడుదల చేశారు మేకర్స్ .
యం.వీ.వీ సినిమాస్ , కోనా ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్త నిర్మాణంలో యం.వి.వి. సత్యనారాయణ ,కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజుగాడు ఫేమ్ సంజనారెడ్డి ఈ సినిమాను తెరకెక్కించనుంది. ‘‘భారత వెయిట్ లిఫ్టర్, తెలుగు తేజం కరణం మల్లీశ్వరి . ఆమె శ్రీకాకుళంలోని ఓ మారుమూల పల్లె నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం గెలిచే వరకు ఆమె జీవితాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు తయారవుతోంది. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల వివరాలు తెలుస్తాయి.