రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో డా.సోమేశ్వ‌ర‌ రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్  లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం  `క‌ర‌ణ్ అర్జున్‌`.ఈ  చిత్రానికి  ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న గ్రాండ్ గా 186 థియేటర్స్ లలో విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో  ప్రి రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంతరం

చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ…” మహాభారతం లోని కర్ణుడు , అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టు మలుస్తూ తెరకేక్కించిన ఈ చిత్రంలోని  ప్రతి సీన్ ఎంటర్ టైన్ చేస్తుంది. మంచి లొకేషన్స్ కొరకు పాకిస్థాన్ బార్డర్ లో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ షూట్ చేశాము.ప్ర‌తి స‌న్నివేశం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటుంది.ఈ సినిమాలో ఆర్టిస్టులు కొత్తవారని చూడకుండా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలని కంటెంట్ ని న‌మ్ముకుని చేసిన సినిమా ఇది“.మా సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఎంట‌ర్ టైన్ చేస్తుంది. నచ్చుతుంది.నిర్మాతలు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. న్యూ ట్యాలెంట్ ఉన్న వారు బయట చాలా మంది వున్నారు. వారందరికీ ఇలాంటి కొత్త నిర్మాతలు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను మూడు పాత్ర‌ల‌తో రోడ్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కించాం.  మొదట ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రిలీజ్ చెయ్యాలి అనుకున్నాము. కానీ సౌత్, రాష్టాలలో తో పాటు నార్త్ లో కూడా  మా సినిమాను ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన బాల‌కృష్ణ ఆకుల మాట్లాడుతూ…’ఈ సినిమా బాగా వచ్చింది. సుకుమార్, అనిల్ రావిపూడి, పరుశురాం తదితరులు మా సినిమాకు సపోర్ట్ చేశారు. వారికి మా ధాన్యవాదాలు. మేము విడుదల చేసిన ట్రైల‌ర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24 న తెలుగు రాష్టాల తో పాటు సౌత్, నార్త్, రాష్టాలలో విడుదల చేస్తున్న మా సినిమా అంద‌రికీ తప్పకుండా న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్, కోరియోగ్రాఫర్ రవిమేకల మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రీ రిలీజ్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. ఈ చిత్ర ట్రైలర్ ఎంతో ఎగ్జ‌యిట్మెంట్ గా ఉందని చూసిన వారంతా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.ఈ సినిమాకు టెక్నిషియన్స్, నటులు అందరూ చాలా కష్టపడ్డారు.మీ అందరి ఆదరణతో ఈ నెల 24 న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

హీరో నిఖిల్ కుమార్ మాట్లాడుతూ…”ఇది మా నాన్న డ్రీమ్. నన్ను హీరోగా తెరపై సినిమా చూడాలనుకున్నారు.మా నాన్న అనుకున్నట్లే సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ఎటువంటి వల్గారిటీ ఉండకుండా ఫుల్ లవ్ & యాక్షన్ ఉంటుంది. చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది అన్నారు.

హీరో అభిమన్యు మాట్లాడుతూ.. ఆర్టిస్ట్ గా నాకిది మెదటి చిత్రమైనా ఆర్టిస్ట్ గా నటనలో నేను ద బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నా. ఇందులో హీరో, హీరోయిన్స్ ఉన్నా కంటెంటే హీరో. మాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదములు అన్నారు.

వివారెడ్డి (పబ్లిసిటీ డిజైనర్) మాట్లాడుతూ…ఈ సినిమా చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను ఎన్నో సినిమాలకు డిజైన్ చేశాను సినిమాలు చూశాను. ఈ సినిమా చాలా బాగుంది. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

హీరోయిన్ షిఫ మాట్లాడుతూ.. నాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.

నటీ నటులు
అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా  , మాస్ట‌ర్ సునీత్ , అనితా చౌదరి, రఘు . జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్స్ : డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల,సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్;
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి మేకల;
కథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం : మోహన్ శ్రీవత్స.
ఫైట్స్ : రామ్ సుంకర;
ఎడిటర్ : కిషోర్ బాబు;
కాస్ట్యూమ్ డిజైనర్ : లతా మోహన్;
మ్యూజిక్ : రోషన్ సాలూర్;
పాట‌లుః సురేష్ గంగుల‌;
కొరియోగ్రఫీ : రవి మేకల;
డి .ఓ .పి : మురళి కృష్ణ వర్మన్;
పిఆర్. ఓ : చందు ర‌మేష్ (బాక్సాఫీస్);
డిజైనర్: వీవా పోస్టర్స్,

Leave a comment

error: Content is protected !!