కన్నడ నటుడు రిషభ్ శెట్టి డైరెక్షన్ లో తనే హీరోగా నటించిన సెన్సేషనల్ మూవీ కాంతార. ఈ సినిమా లాస్టియర్ రిలీజై .. పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లోనూ మంచి వసూళ్ళను సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ రాబోతోంది. ‘కాంతార ఎ లెజెండ్’ చాప్టర్ 1 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ‘కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్‌ జన్మించాడు’ అంటూ రిషబ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. పొడవాటి జుత్తు, నెత్తుటితో తడిచిన దేహం, ఆవేశం నిండిన చూపులతో ఆయన లుక్‌ భయపెట్టేలా ఉంది. బంగ్లాతో సహా.. మొత్తం 7 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తు్న్నట్టు ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ను తలదన్నే రేంజ్ లో ఈ ప్రీక్వెల్ ఉంటుందని చెబుతున్నారు..

Leave a comment

error: Content is protected !!