Kannppa : ప్రతిష్టాత్మక కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో “కన్నప్ప” సినిమా టీజర్‌ ప్రదర్శన ఒక సంచలనంగా నిలిచింది. ఈ చిత్ర టీజర్‌ని చూసి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పంపిణీదారులు, సినీ ప్రముఖులు ముక్తకంఠంతో ప్రశంసించారు. ఈ ఘనతకు మంచు విష్ణు, నిర్మాత మంచు మోహన్‌బాబు, నృత్య దర్శకుడు ప్రభుదేవా తదితర చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేశారు.

“కన్నప్ప” సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు తెలిపిన మంచు విష్ణు, ఈ నెల 30న తెలుగు ప్రేక్షకుల కోసం టీజర్‌ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్లలో టీజర్‌ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామని, జూన్‌ 13న భారతదేశంలోని ఇతర భాషల్లో టీజర్‌ని విడుదల చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని పంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్‌ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.

Leave a comment

error: Content is protected !!