డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. మే 20న జరుగనున్న ఈ ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్‌లో “వరల్డ్ ఆఫ్ కన్నప్ప” పేరుతో టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

భారీ క్యాస్టింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ (బాలీవుడ్), మోహన్ లాల్ (మాలీవుడ్), ప్రభాస్ (టాలీవుడ్) వంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
చిత్రం షూటింగ్‌ చాలావరకు న్యూజిలాండ్‌లో జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కొంత భాగం షూట్ చేశారు. కన్నప్ప చిత్రం ప్రపంచ వేదికపై అందరికీ పరిచయం కానుంది. టీజర్ విడుదల తోపాటు, చిత్రం గురించి మరింత సమాచారం తెలియజేయనున్నారు.

Leave a comment

error: Content is protected !!