Kannappa : యంగ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప”. మహా శివభక్తుడైన తిన్నడుకు చెందిన స్థలపురాణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలియడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

హీరో విష్ణు మంచు ఇటీవల ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చిత్రం డిసెంబర్ 2024లో విడుదల కానుందని ప్రకటించారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ప్రతిభావంతులైన సిబ్బంది ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్, కథ, కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని భావిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!