Kannappa : మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు నిర్మించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు అతిథి పాత్రల్లో నటించారు. ఈ చిత్ర టీజర్ ను ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా, మంచి స్పందన పొందింది.

ఇంక ‘కన్నప్ప’ టీజర్ ను ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మంచు విష్ణు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. “ఈ చిత్రానికి నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉండలేను. జూన్ 14న టీజర్ ను విడుదల చేస్తున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది” అని మంచు విష్ణు తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!