బాలీవుడ్ లో ఫైర్‌బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్. నిత్యం ఎదో ఒక విషయాన్ని తనదైన శైలిలో వివాదాస్పంగా స్పందిస్తూ ఉండే కంగనాకు ట్విటర్ నుండి ఊహించని షాక్ ఎదురైంది. తాజాగా తన అకౌంట్ లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత తీవ్రస్థాయిలో హింస జరుగుతోందంటూ ఆమె పలు వీడియోలను, సందేశాలను అభిమానులతో పంచుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలనకు ఆదేశించాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసింది.ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపడంతో ఆమె అకౌంట్‌ను నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.