Kanchana 4 : కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాఘవ లారెన్స్ మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. “స్టైల్”, “మాస్”, “కంచన” సిరీస్ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కంచన 4” కోసం దర్శకుడిగా తిరిగి మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు.

“జిగర్తండా డబల్ X” తమిళంలో విజయం సాధించిన నేపథ్యంలో ఈ వార్త లారెన్స్ అభిమానులను ఖచ్చితంగా ఉత్సాహపరుస్తుంది. తెలుగులో ఈ సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ, డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ కంచన హారర్ కామెడీ ఫ్రాంచైజీలోని నెక్స్ట్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “కాంచన 4” చిత్రీకరణ 2024 సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. లారెన్స్ యాజ్ యూజువల్ గా ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నారు.

ఇతర ప్రాజెక్ట్‌లతో కూడా లారెన్స్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన “అధిగారం” , “దుర్గా” చిత్రాల చిత్రీకరణలో ఉన్నారు. ఇవి ఆయన బహుముఖ ప్రజ్ఞా కు నిదర్శనంగా నిలవబోతున్నాయి. మరి ఈ కాంచన 4 తెలుగులో ఏ పేరుతో వస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!