‘ఆనంద్’ ఓ మంచి కాఫీ లాంటి సినిమా అంటూ తెలుగు తెరకు పరిచయమై, ‘అందంగా లేనా అసలేం బాలేనా’ అంటూనే ‘గోదావరి’ తీరాన తన చీరకట్టు అందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. ‘గోపి’ కోసం గోదావరి ఒడ్డున కూర్చ్చున్న ‘గోపిక’లా చూడగానే పదహారణాల తెలుగింటి అమ్మాయిలా అనిపిచించి ‘హ్యాపీడేస్’ సినిమాలో ఇంగ్లీష్ టీచర్ గా తళ్లుక్కుమని మెరిసి యువ హృదయాలను కొల్లగొట్టిన ‘కమలిని ముఖర్జి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీ వాల్యూం.
చూడగానే ఆకట్టుకునే అందం దానికి తగ్గ అభినయం కూడా తోడవడంతో తనకు కెరీర్ ప్రారంభంలోనే మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు లభించాయి.
బాల్యం, నాటకాభిలాష :
కమలిని ముఖర్జి (అసలు పేరు: రోష్ని లేక రోని) మార్చి 4, 1980 లో కలకత్తాలో జన్మించింది. తనకు ఇద్దరు చెల్లెళ్ళు. స్కూల్, కాలేజ్ లలో నాటక ప్రదర్శనల తర్వాత ముంబాయి పట్టణంలో నాటకాల పై నిర్వహించిన అభ్యాస సదస్సులో పాల్గొన్నది. నాటకాలే కాకుండా, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, చిత్రలేఖనం వంటి అలవాట్లు కమలినికి చాలా ఇష్టమైనవి. తను ఎక్కువ సంవత్సరాలు భరత నాట్యం అభ్యాసం చేసింది. కమలిని సినిమాలలోకి రాకముందు నీల్‌కమల్ ప్లాస్టిక్ సామాన్లు, పారాచూట్ కొబ్బరి నూనె, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీం ఇంకా ఆయుష్ వంటి ఇతర వాణిజ్య వ్యాపార ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది.
సినిమాలలో అవకాశం :
కమలినిని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలేంగే (2004) హిందీ చిత్రంలో అవకాశమిచ్చింది. ఎయిడ్స్ కథా నేపథ్యంలో సాగె ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ) చదివిన కమలినికు కవిత్వం రాయటం ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికయిన సందర్భంలో, వాషింగ్టన్ లో (దలైలామా ఆధ్వర్యాన) నిర్వహించిన కవితా సదస్సుకు ఆహ్వానించిన 150 మందిలో కమలిని ఉంది. అదే సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ సినిమాలో కథానాయిక అవకాశం ఇవ్వడంతో తెలుగు తెరకు ‘రూప’ గా పరిచయమై అందరి మనసులను తన వైపుకు ఆకర్షించేలా చేసింది. ‘సీత’ గా గోదావరిలో తన అందం అల్లరితో కూడిన అభినయంతో పాటు క్రిష్ తీసిన ‘గమ్యం’ లో ‘జానకి’ వంటి రోల్స్ లో తన నటనతో ఆకట్టుకుంది. తెలుగు చిత్రాలతో పాటు హింది, తమిళ, మలయాళం ఇంకా కన్నడ చిత్రాలలో నటించింది.
అవార్డులు :
‘ఆనంద్’ చిత్రంలో ‘రూప’ పాత్రలో కనపరచిన నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు నంది బహుమతిని గెలుచుకుంది.
కమలిని ముఖర్జి’ చేసిన సినిమాలు :
ఆనంద్ (2004) – రూప
మీనాక్షి (2005) -మీనాక్షి
గోదావరి (2006) -సీతా మహాలక్ష్మి
స్టైల్ (2006) – ప్రియ
రాఘవ (2006) -కయల్విఝి రాఘవన్ (తమిళ అనువాద చిత్రం)
క్లాస్ మేట్స్ (2007) -రజియా
హ్యాపీ డేస్ (2007) -శ్రీయ
పెళ్ళైంది కాని (2007) -గాయత్రి
బ్రహ్మానందం డ్రామా కంపనీ (2008) -అర్పిత
జల్సా (2008) -ఇందు
గమ్యం (2008) – జానకి
గోపి గోపిక గోదావరి (2009) – గోపిక
మా అన్నయ్య బంగారం (2010) – మంజు
పోలీస్ పోలీస్ (2010) – హారిక (తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం)
నాగవల్లి (2010) – గాయత్రి
విరోధి (2011) -సునీత (అతిథి పాత్ర)
రామాచారి (2011)
గోవిందుడు అందరివాడేలే (2014)
మన్యంపులి (2016)