kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ కల్కి 2898 AD. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. విజువల్స్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. లెజెండరీ నటుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ట్రైలర్ లో ఆయన లుక్ కు అందరూ షాక్ అవుతున్నారు. భయంకరమైన లుక్‌లో కనిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో కమల్ కాళిగా నటించారు .

ట్రైలర్ ఎండింగ్ కమల్ హాసన్ రివీల్ అయ్యారు. కాలిపోయిన ముఖంతో వృద్ధాప్యంలో కొంత భారమైన స్వరంతో కనిపించిన ఆయన లుక్స్ సినిమాపై మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి. కమల్ అభిమానులు దీనిని గూస్‌బంప్స్ మూమెంట్స్ అంటున్నారు. ఈ చిత్రానికి కమల్ పెద్ద రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ట్రైలర్ ప్రకారం అమితాబ్ బచ్చన్ పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉందని అర్ధమవుతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రం పురాణాలు, భవిష్యత్తు సాంకేతికతను లింక్ చేస్తూ రూపొందే ఈ సినిమాను వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!