కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్ తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. అయితే కరోనా వైరస్‌‌ను జయించేందుకు కొందరు హీరోలు  పాటల ద్వారా చైతన్య పరుస్తున్నారు .

ప్రపంచ మానవాళిని ఇబ్బందిపెడుతున్న కరోనా వైరస్‌ పై  అవగాహన కల్పిస్తూ స్వయంగా పాట రాసి ఆలపించారు జాతీయ నటుడు కమల్‌హాసన్‌. ‘అరివుమ్ అన్బుమ్’ అంటూ సాగే   ఈ పాటకు ఆయనతో పాటు సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, యువన్‌ శంకర్‌ రాజా, అనిరుధ్, గాయనీగాయకులు బాంబే జయశ్రీ, శంకర్‌ మహదేవన్, నటీనటులు సిద్ధార్థ్, ఆండ్రియా, కూతురు శ్రుతిహాసన్‌ కూడా గొంతు కలిపారు. ఈ పాటకు జిబ్రాన్‌ సంగీతం అందించారు. నటుడు కమల్‌హాసన్‌ తమిళ ప్రభుత్వానికి తను పార్టీ కార్యాలయాన్ని క్యారైంçన్‌ కేంద్రంగా వాడుకోవచ్చుని గతంలోనే చెప్పారు. చిత్రసీమ ఈ లాక్‌డౌన్‌ కాలంలో కరోనాపై అవగాహన కల్పిస్తూనే తమవంతుగా సామాజిక సేవ చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ తమ పనులను తామే స్వంతంగా చేసుకుంటూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ సందడి చేస్తున్నారు.

వీడియో సాంగ్ ను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=kDUqOcvUVIQ

 

Leave a comment

error: Content is protected !!