విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత, కమల్ హాసన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమాతో ఆయన అద్భుతమైన కలెక్షన్లు సాధించాడు. ఈ నేపథ్యంలో కమల్ రాబోయే సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ ఈ ఏడాది రెండు సినిమాలతో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు! అది కూడా కేవలం రెండు వారాల వ్యవధిలోనే.

కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ఇండియన్ 2. ఈ క్రేజీ సినిమా జూన్ లో విడుదల కానుంది. జూన్ 13న రాబోతుందని తాజా కోలీవుడ్ టాక్. మే 15న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.

ఇక కమల్ హాసన్ నటిస్తున్న మరో క్రేజీ మూవీ ప్రభాస్ కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇందులో కమల్ హాసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. కల్కి ఫస్ట్ పార్ట్ లో కమల్ పాత్ర చిన్నగా ఉన్నా, సెకండ్ పార్ట్ లో ఎక్కువ సేపు కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద, కమల్ హాసన్ కేవలం రెండు వారాల వ్యవధిలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు!

Leave a comment

error: Content is protected !!