Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబో లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం “కల్కి 2898”. ఈ చిత్రంలో దీపికా పదుకునే, దిశా పటాని కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో కమల్ హాసన్ పాత్ర గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ దాదాపు 20 నిమిషాలు మాత్రమే స్క్రీన్‌పై కనిపించనున్నారు. అయితే, పార్ట్ 2లో ఆయన పాత్ర 90 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. కమల్ హాసన్ పాత్రపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!