Kamal Haasan : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన సందేశాత్మక చిత్రం “భారతీయుడు 2”. జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న కమల్ హాసన్ తెలుగు ప్రేక్షకులపై తన ప్రేమను చాటుకున్నారు.

“తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ను చేశారు. నాకు క్లాసిక్ హిట్స్ అన్నీ తెలుగులోనే ఉన్నాయి,” అని కమల్ హాసన్ అన్నారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ, “భారతీయుడు 2లో నేను పోషించిన సేనాపతి పాత్ర చెప్పే డైలాగ్స్ అన్నీ సమాజం నుండి వచ్చినట్టే ఉంటాయి. రెండు వేళ్లు మడత పెట్టడం అంటే ఒకటి ఓటు వేసేది, రెండోది మన బాధ్యత గుర్తుంచుకోవడం,” అని వివరించారు.
సినిమాలో యాక్షన్, పాటలు ఉన్నాయా అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారని, అవన్నీ ఖచ్చితంగా ఉంటాయని, కానీ చాలా భిన్నంగా ఉంటాయని కమల్ హాసన్ చెప్పారు.

“నేను గురువు అని సిద్దార్థ్ పాత్ర ఈ చిత్రంలో చెబుతుంది. అవే మాటలు నేను శివాజీ గణేశన్ గారికి చెప్పేవాడిని. సిద్దార్థ్, నేను ఒకే గురువు శిష్యులు. ఇంకా కమల్ హాసన్ లాంటి వారు, సిద్దార్థ్ లాంటి వారు రావాలి. ఈ చిత్రం ద్వారా సమాజానికి కొంత గుణం చేకూర్చాలని భావిస్తున్నాను. అందరూ ఈ సినిమాను చూసి, మెసెజ్‌ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీడియా సహకారంతో ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలని భావిస్తున్నాము,” అని కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్, కాకినాడ విశ్వనాథ్, సిద్ధార్థ్ తదితరులు నటించారు.

Leave a comment

error: Content is protected !!