Kalyanram : టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు సూర్య ప్రతాప్. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ యువ దర్శకుడికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి పని చేయడం వల్ల మంచి పేరు వచ్చింది. సుకుమార్ అందించిన కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలతో తెరకెక్కిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ’18 పేజీస్’ సినిమా కూడా డిసెంట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు సూర్య ప్రతాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు.
సూర్య ప్రతాప్ తన తదుపరి చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్‌తో చేయ బోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కళ్యాణ్ రామ్‌కు ఒక కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించే అవకాశం ఉంది. ఈ సినిమా కథలో సుకుమార్ ప్రమేయం ఉందో లేదో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ కూడా ‘మెరుపు’ అనే టైటిల్‌తో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటికీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమా కోసం ఈ టైటిల్‌ను అనుకుంటున్నారు. త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రదీప్ సినిమా పూర్తయిన తర్వాత సూర్య ప్రతాప్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. సుకుమార్ శిష్యుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూర్య ప్రతాప్, తన తదుపరి చిత్రాలతో కూడా అదే జోరును కొనసాగిస్తారని ఆశిద్దాం.