Kalki 2898AD : కేవలం 10 రోజుల్లో పురాణ-సైన్స్-ఫిక్షన్ కలగలిసిన సూపర్ మూవీ కల్కి 2898 AD థియేటర్స్ లోకి దిగిపోబోతోంది. భారీ బడ్జెట్ లో విజువల్ గ్రాండియర్ గా రూపొందిన ఈ మూవీ .. పాన్-ఇండియన్ ఐకాన్ ప్రభాస్ , నాగ్ అశ్విన్ కాంబోలో మొట్టమొదటిది. ఈ సినిమా ప్రచార పాట భైరవ ఆంథమ్ ఈరోజు  డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలోకి వచ్చేసింది. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. దిల్జిత్ దోసాంజ్ గాత్రదానం చేసిన ఈ ట్రాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు ఉత్సాహంగా దాని బీట్‌లను ఆస్వాదిస్తున్నారు. ఉత్సాహాన్ని పెంచడానికి, మేకర్స్ దిల్జిత్ దోసాంజ్ అండ్ ప్రభాస్ అసమానమైన ఫ్లెయిర్‌తో లయకు అనుగుణంగా ఉన్న మ్యూజిక్ వీడియోను ఆవిష్కరించారు. పంజాబీ స్టైల్లో సాగే ఈ ప్రచార గీతం అన్ని భాషల్లోనూ ఆకట్టుకుంటోంది.

దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పటాని వంటి ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు, కమల్ హాసన్ విలన్ గా షాకింగ్ మేకోవర్ తో కనిపించబోతున్నాడు. ఇంకా రాజేంద్ర ప్రసాద్, శాశ్వత ఛటర్జీ, పశుపతి, మృణాల్ ఠాకూర్ , హర్షిత్ మల్గిరెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మాణంలో ఈ మాగ్నమ్ ఓపస్ ప్రపంచవ్యాప్తంగా IMAX, 4DX , 3D ఫార్మాట్‌లతో సహా బహుభాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.

Leave a comment

error: Content is protected !!