గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో “బుజ్జి” అనే పేరు ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక టీజర్ తో ఈ హైప్ కి కారణమయ్యారు. “మన జీవితాల్లోకి ఎవరో కొత్త వ్యక్తి రాబోతున్నాడు” అంటూ ప్రభాస్ చెప్పడంతో అభిమానులు ఆయన పెళ్లి ఖాయమని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన కొత్త సినిమా “కల్కి” లో భాగంగా ఈ ప్రచారం జరిగిందని తెలిసి అందరూ షాక్ అయ్యారు.

చివరకు “బుజ్జి” రహస్యం బయటపడింది. అది ఒక కారు . “మన శరీరాన్ని మన మెదడు ఎలా నియంత్రిస్తుందో, అలాగే బుజ్జిని కూడా ఒక మెదడు నియంత్రిస్తుంది” అని చిత్రబృందం వివరించింది. “బుజ్జి” గురించి మరింత ఆసక్తి కలిగించడానికి చిత్రబృందం చాలా ట్రిక్కులు ఆడింది. ఒక ఫన్నీ వీడియోను విడుదల చేసి, ఆ తర్వాత మే 22వ తేదీన బుజ్జిని పూర్తిగా చూపిస్తామని ప్రకటించారు. ఈ వీడియోలో హీరోయిన్ కీర్తి సురేష్ గాత్రదానం చేయడం ప్రత్యేక ఆకర్షణ.

“కల్కి 2898 ఏడీ” అనే సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేక్షకులను భవిష్యత్తులోకి తీసుకెళ్లనున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగ్ అశ్విన్ “కల్కి” సినిమా ప్రమోషన్లలో చాలా కొత్త ఆలోచనలను పంచుకుంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Leave a comment

error: Content is protected !!