Kalki 2898 AD trailer : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం “కల్కి 2898 ఏడీ” . ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రెండు నిమిషాలు యాభై ఒక్క సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ని చూస్తుంటే.. ఇది భారతీయ పురాణాలు, అత్యాధునిక సైన్స్ ఫిక్షన్ కలయికతో రూపొందిన ప్రత్యేకమైన చిత్రమని అర్ధమవుతోంది.

ఈ ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ ఇంకా మరిన్ని భాషల్లో విడుదలయింది. ట్రైలర్ మనకి అద్భుతమైన విజువల్స్ ను పరిచయం చేస్తుంది. లెజెండరీ నటీనటులు తమ తమ పాత్రల్ని అద్భుతంగా పోషించారు. అమితాబ్ బచ్చన్ తన సిగ్నేచర్ డైలాగ్ డెలివరీతో .. అశ్వత్థామ పాత్రను పోషిస్తుండగా, కమల్ హాసన్ ఆసక్తికరమైన పాత్రలో గుర్తించలేని విధంగా కనిపిస్తారు.

ప్రభాస్ తన శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టాడు. దీపికా పదుకొణె తన వైవిధ్యమైన భావాలతో భావోద్వేగ డైలాగ్స్ ను జోడించగా, దిశా పటాని తన డైనమిక్ యాక్షన్ సన్నివేశాలతో సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది.

 

Leave a comment

error: Content is protected !!