Kalki 2898 AD : ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి సినిమా విడుదల ఒక్కరోజులోకి వచ్చేసింది. రేపే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందించబోతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులు సృష్టించింది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం, 2024లో విడుదలైన సినిమాల్లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 10 లక్షల టిక్కెట్లు అమ్ముడైన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

ఇప్పటివరకు, కల్కి ప్రీ-సేల్ బుకింగ్‌లో మొత్తం 13.5 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. నార్త్‌లో ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్స్, ప్రభాస్ గత చిత్రం ‘సలార్’ రికార్డులను అధిగమించాయి. అమెరికాలో కూడా, ఈ చిత్రం 3 మిలియన్ డాలర్స్ కు పైగా వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా అగ్ర నటీనటులు నటించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన తదితరులు తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!