Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, అందాల దీపికా పాడుకునే, దిశా పటాని నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ మూవీ సరిగ్గా మరో 6 రోజుల్లో థియేటర్స్ లోకి దిగిపోబోతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ తో కూడిన ఈ చిత్రం 2 గంటల 58 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణ సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

అయితే కల్కి సినిమా సాధారణ సినిమా కాదు. ఇది అన్ని పురాణాలకు ఒక ముగింపుని చెప్పే భారీ కథాంశంతో రూపొందిన చిత్రం. దీనికి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ఈ కథను చెప్పడానికి ఈ నిడివి అవసరమని నమ్ముతున్నారు.  “యానిమల్” సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు. అంత పెద్ద సినిమా థియేటర్ లో కూర్చోవడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన వసూళ్లు ఆ అభిప్రాయాన్ని ఖండించాయి.

“కల్కి” కూడా “యానిమల్” లాంటిదే. కథ యొక్క ఆసక్తిని బట్టి ప్రేక్షకులు 3 గంటలకు పైగా థియేటర్ లో కూర్చోవడానికి సిద్ధంగా ఉంటారని నమ్ముతున్నారు చిత్రబృందం. “కల్కి” మూవీ పెద్ద కథ, పెద్ద కాన్వాస్ తో రూపొందిన సినిమా. ఈ చిత్రం థియేటర్ లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!