Kalki 2898 AD : రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన “కల్కి” సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా కేవలం 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి, బాహుబలి తర్వాత మరోసారి వెయ్యి కోట్ల మార్కును దాటిన భారతీయ చిత్రంగా నిలిచింది.

జూన్ 27న విడుదలైన “కల్కి” సినిమా భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా 17 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి, బాలీవుడ్ లోనూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాకు రికార్డ్ స్థాయి వసూళ్లు దక్కాయి.

“కల్కి” సినిమా విజయంతో మరోసారి తన స్టార్ డమ్ ను నిరూపించుకున్నాడు ప్రభాస్. భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ ను శాసించగల సత్తా తనకు ఉందని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ప్రభాస్ రాబోయే చిత్రాలపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “రాజా సాబ్”, ప్రశాంత్ నీల్ తో “సలార్ 2”, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” చిత్రాలతో పాటు హను రాఘవపూడితో ఒక క్రేజీ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

Leave a comment

error: Content is protected !!