యం.ఎల్.ఏ, సీత, కవచం, రణరంగం’ చిత్రాలతో టాలీవుడ్ లో వరుస పరాజయాలు ఎదుర్కొంది అందాల చందమామ కాజల్ అగర్వాల్ . అందుకే ఈ ఏడాది మంచి మంచి బ్యానర్స్ లో క్రేజీ కాంబోస్ తో కాజల్ విజయాల వేట మొదలుపెట్టింది. లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కలయికలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘ఇండియన్ 2’ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది కాజల్. అలాగే మంచు విష్ణు హీరోగా హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మోసగాళ్ళు చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు బాలీవుడ్ లో ‘ముంబై సాగా’ అనే చిత్రంతోనూ రానుంది. ఇక వీటితో పాటు కాజల్ మరో క్రేజీ మూవీకి కమిట్ అయింది. అందులో హీరో దుల్కర్ సల్మాన్ కావడం విశేషంగా మారింది.

సౌత్ లో చాలా సినిమాలకు తన డ్యాన్స్ కొరియో గ్రఫీతో మంచి పేరు తెచ్చుకున్న బృంద మాస్టర్ .. ఇప్పుడు మెగా ఫోన్ పట్టనుంది. అంతేకాదు ఆమె తొలి చిత్రమే దుల్కర్ సల్మాన్ తో చేయనుండడం సౌత్ లోనే ఆసక్తిగా మారింది. కాజల్ అగర్వాల్ , అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా నిన్ననే చెన్నైలో ప్రారంభమైంది. ఫష్ట్ షాట్ కు నిన్నటి కథానాయిక ఖుష్బూ సుందర్ క్లాప్ కొట్టగా.. ముఖ్యఅతిథులుగా మణిరత్నం, సుహాసిని ముఖ్య అతిథులుగా విచ్చేయడం  విశేషం. ఇక ఈ సినిమాకి‘ హే… ‘సినామిక అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. దుల్కర్, అదీరావు భార్యా భర్తలుగా  నటిస్తుండగా.. వారిద్దరి మధ్యలో  ఎంటరయ్యే  అందాల భామగా  కాజల్ నటించనుంది. . ఈ సినిమా విశేషాల్ని దుల్కర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  మరి ఈ సినిమా కాజల్ కు ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

 

 

Leave a comment

error: Content is protected !!