Kannappa : టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో నటీనటుల క్యాస్టింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు మరెన్నో మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

ఇంక ఇందులో పార్వతీదేవి పాత్రలో నయనతార నటిస్తోందని ముందుగా వార్తలొచ్చాయి. అయితే అది ఒట్టి రూమర్ గా తేలిపోయింది. ఇటీవలే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆమె ఏ పాత్రలో నటిస్తుందనే విషయం ఇంకా వెల్లడించలేదు.

మంచు విష్ణు సోదరిగా కాజల్ ఇప్పటికే మోసగాళ్ళు సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ, మళ్ళీ కన్నప్ప సినిమాలో కలిసి నటించడానికి కాజల్ అంగీకరించడం విశేషం.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. 2024లోనే ఈ చిత్రం విడుదల కానుంది. కన్నప్ప సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Leave a comment

error: Content is protected !!