Kajal Agarwal : తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది అని సీనియర్ నటి కాజల్ అగర్వాల్ చెబుతున్నారు. తల్లి అయ్యాక తన కొడుకు నీల్ కోసం మరింత జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నారట. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సినిమాల్లో భాగంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కాజల్ ఈ విషయాలను వెల్లడించారు.
“నీల్ ఈ భూమ్మీదికి వచ్చాక నా సినిమా, వ్యక్తిగత జీవితం పూర్తిగా మారిపోయాయి. ఇబ్బంది కలిగించే పాత్రలకు ఇక నేను వెళ్లాలనుకోవడం లేదు. ప్రతి చిన్న పనినీ బాగా ఆలోచించి చేస్తున్నాను. నాలో ఓపిక పెరిగింది, ఇతరుల పట్ల సానుభూతితో ఉంటున్నాను. ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా.. అది నా కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచిస్తున్నాను” అని కాజల్ తన భావోద్వేగాలను వ్యక్తపరిచారు. ‘సత్యభామ’ సినిమాలో సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉన్న కాజల్, అగ్ర నటుడు కమల్ హాసన్ తో కలిసి ‘భారతీయుడు 2’లోనూ నటించబోతున్నారు.