సౌత్ ఇండస్ట్రీలో అందాల ఆండ్రియా జెర్మియా .. విభిన్న తరహా కథానాయిక. అందరు   హీరోయిన్స్ లా రొటీన్ గ్లామర్ పాత్రలతో..  డ్యాన్సింగ్ డాల్ గా మారిపోకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. పాత్ర డిమాండ్ ను బట్టి.. అవసరమనుకుంటే..  విలన్ గానూ, నేకెడ్ గానూ మారిపోవడానికి ఎలాంటి మొహమాటాలు పడని ఈ సుందరి.. లేటెస్ట్ గా ‘కా’ అనే ఒక ఫారెస్ట్ థ్రిల్లర్ లో నటిస్తోంది.  పూర్తిగా అడవుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్ .. ఇటీవల విడదలై.. వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

ఆండ్రియా, సలీం గౌస్‌, మరిముత్తు, కమలేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం టీజర్ ఎలాంటి  సంభాషణలు లేకపోయినప్పటికీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఓ అడవిలో హత్యలు జరుగుతుంటాయి. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆండ్రియాకి ఆ హత్యలకు కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నేపథ్యం సంగీతం, నటుల హావభావాలతో ఆద్యంతం ఆసక్తి పెంచుతోంది టీజర్‌. నాజిల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్‌ మ్యాక్స్‌ నిర్మించారు. సుందర్‌ సి. బాబు సంగీతం అందించారు.

టీజర్ వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి. 

https://www.youtube.com/watch?v=CrljkrgEBbs&feature=emb_logo

 

 

Leave a comment

error: Content is protected !!