బాహుబలి చిత్రంలో సేతుపతి గుర్తున్నాడా.. ఈ పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రాకేష్ వర్రే. ఎవ్వరికీ చెప్పొద్దు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాకేష్‌ వర్రే..చాలా కాలం తర్వాత మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. కొంతకాలం క్రితం జితేందర్‌ రెడ్డి టైటిల్‌తో సినిమా పోస్టర్‌ లాంచ్ చేసారు. అందులో ఓ లీడర్ లా కనిపించే పాత్ర ఫేస్‌ రివీల్ చేయకుండా లాంచ్ చేసారు. ఆ పాత్ర ఎవరు ? ఎందుకు హీరో తెలియకుండా పోస్టర్‌ లాంచ్ చేసారు అనే ఆసక్తి ఇండస్ట్రీ, ఆడియెన్స్‌ వర్గాల్లో చర్చ సాగింది.

ఇప్పుడు ఆ పాత్ర ఎవరో రివీల్ చేస్తూ పోస్టర్‌ రిలీజ్‌ చేసారు. జితేందర్‌ రెడ్డి టైటిల్‌తో పోలీస్ గెటప్‌లో గన్‌ పట్టుకుని డైనమిక్‌ లుక్‌తో రాకేష్‌ వర్రే లుక్‌ ను రివీల్ చేసారు. ఎవ్వరికీ చెప్పొద్దు తర్వాత లాంగ్ గ్యాప్‌ తీసుకుని రాకేష్ వర్రే చేస్తున్న మూవీ ఈ జితేందర్‌ రెడ్డి. టైటిల్‌ పాత్ర పోషించేది రాకేషేనా.. కాదా అనేది చిత్రం గురించి ఫుల్ డిటేల్స్ అఫిషియల్‌ గా రివీల్‌ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. ఈ పాత్ర కోసం డైరెక్టర్ విరించి వర్మ 6 నెలల పాటు ఎంతోమందిని స్క్రూటినీ చేసి రాకేష్ వర్రేను సెలెక్ట్ చేసారట.

Leave a comment

error: Content is protected !!