Jewel Thief : కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘జ్యువెల్ థీఫ్’. ఈ సినిమా టీజర్ అండ్ ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, మల్లెల ప్రభాకర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణసాయితో పాటు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు.

ఈ వేడుకలో ప్రత్యేక అతిథులుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, ఏపీ మరియు తెలంగాణ ఇన్కమ్ టాక్స్ కమీషనర్ IRS ఆఫీసర్ జీవన్ లాల్ లవిదియ మరియు నటి ఎస్తర్ పాల్గొన్నారు. వీరు చిత్ర టీజర్, పాటలను విడుదల చేశారు. టీజ‌ర్, ఆడియో వేడుక‌లో న‌టీన‌టుల‌తో పాటు, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సినిమా హైలైట్స్, చిత్రీకరణ అనుభవాలు తెలిపారు. త్వర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నట్టు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!