యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందు ఉంటుంది. గతేడాది ఎందరో కొత్త వారిని పరిచయం చేస్తూ ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ ని చేయడానికి సిద్ధమవుతోంది.

‘జెర్సీ’ వంటి క్లాసికల్ సినిమా తర్వాత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలువురు కొత్తవారిని ప్రధాన పాత్రలలో పరిచయం చేస్తూ ‘మ్యాజిక్’ అనే సెన్సిబుల్ టీనేజ్ డ్రామాతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు.

ఈ కథ, త్వరలో జరగబోయే తమ కాలేజీ ఫెస్ట్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్ ను కంపోజ్ చేయడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు ఉన్నాయి.

ఈ ఆకర్షణీయమైన టీనేజ్ మ్యూజికల్ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రాన్ని 2024 వేసవిలో తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను రానున్న రోజుల్లో మేకర్స్ వెల్లడించనున్నారు.

Leave a comment

error: Content is protected !!