తమిళనాట అందరూ “పురట్చితలైవి” అంటే నగరానికే అమ్మ అని అర్ధం. అలా తనని చెన్నై నగరవాసులు ఆప్యాయంగా అభిమానంతో అమ్మగా పిలుచుకునే జయలలిత జయంతి నేడు. జయలలిత ఫిబ్రవరి 24, 1948 లో మైసూరు రాష్ట్రంలో జన్మించారు. ఈమె తల్లి కుడా నటినే. ఆమె మాయాబజార్ సినిమాలో యన్టీఆర్ పక్కన రుక్మిణి పాత్రలో నటించింది. చిన్నతనం నుంచి కష్టాల్లో పెరిగిన జయలలిత చదువులో రాణిస్తున్న సమయంలోనే ఆమెకు సినిమా అవకాశం వచ్చింది. 1961 నుంచి 1980 మధ్యకాలంలో అనేక సినిమాల్లో నటిస్తూ మెప్పించారు. ఎంజీఆర్ తో అత్యధిక సినిమాలు చేసిన జయలలిత, ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడిఎంకే పార్టీలో చేరారు. 1984 నుంచి 1989 వరకు జయలలిత తమిళనాడు నుంచి రాజ్యసభకు ప్రతినిధ్యం వహించారు. 1991 లో జయలలిత తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 వరకు, ఆ తరువాత 2010 నుంచి 2015, 2015 నుంచి 2016 డిసెంబర్ 5 తేదీన మరణించే వరకు ఆమె ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. ఈరోజు జయలలిత జయంతి సందర్భంగా ఆమె సిని విశేషాలను గుర్తు చేసుకుందాం.
తెలుగుతెరపై అందాలతారగా వెలిగి, తమిళనాట తలైవిగానూ జేజేలు అందుకున్నారు జయలలిత.తెలుగు చిత్రసీమలో జయలలిత అడుగు పెట్టడంతోనే అదరహో అనిపించింది. అప్పటి దాకా తెలుగు సినిమా ‘ఏ’ సర్టిఫికెట్ ను చూసి ఉండలేదు. జయలలిత తొలి తెలుగు చిత్రం ‘మనుషులు – మమతలు’తోనే తొలి ఏ సర్టిఫికెట్ మూవీని చేసింది. అందాల ఆరబోతకు సై అంటూనే అభినయప్రాధాన్యమున్న చిత్రాలలో పాత్రలు చేసి మెప్పించారు జయలలిత. తొలి సినిమాతోనే తనదైన బాణీ పలికించిన జయలలిత, తెలుగులో యన్టీఆర్ తో కలసి పలు విజయవంతమైన సినిమాలు చేసింది. వారిద్దరూ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. వాటిలో ఎక్కువుగా జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించారు.
తెలుగు చిత్రసీమలో ‘మనుషులు – మమతలు’ అనే ఏయన్నార్ సినిమాతో తెరంగేట్రం చేసిన జయలలిత, ఆయనతో చేసిన ‘నాయకుడు – వినాయకుడు’ సినిమానే చివరి సినిమా అవ్వడం విశేషం. అలా తన తొలి చివరి సినిమాల కథానాయకుడు ఏయన్నార్ కావడం ఓ విశేషం. ఇక యన్టీఆర్ హిట్ పెయిర్ గా పేరొందిన జయలలిత నిజజీవితంలో అందాల నటుడు శోభన్ బాబుతో సాన్నిహిత్యంగా ఉన్నారు. వారిద్దరి ప్రేమాయణం గురించి ఈ నాటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే శోభన్ తో జయలలిత నటించిన ఏకైక చిత్రం ‘డాక్టర్ బాబు’. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగునాట అందాలతారగా జైత్రయాత్ర చేసిన జయలలిత, ఎమ్జీఆర్ ప్రోత్సాహంతో తమిళనాట రాజకీయాల్లో ప్రవేశించారు. ఎమ్జీఆర్ అనంతరం అన్నాడిఎమ్.కే. పార్టీని విజయతీరాలకు చేర్చిన ఘనత జయలలిత సొంతం. ఆమె 2016, డిసెంబరు5న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఏదిఎమైన అభిమానుల హృదయాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జయలలిత. ఆమె జయంతి సందర్భంగా తమిళనాడు అంతటా ” పురట్చితలైవి ” అని పిలుచుకునే జయలలితకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.
ఆమె కథానాయికగా చేసిన పలు తెలుగు సినిమాలు
మనుషులు మమతలు (1965)
కథానాయకుని కథ (1965)
ఆమె ఎవరు? (1966)
ఆస్తిపరులు (1966)
కన్నెపిల్ల (1966)
గూఢచారి 116 (1966)
నవరాత్రి (1966)
గోపాలుడు భూపాలుడు (1967)
చిక్కడు దొరకడు (1967)
ధనమే ప్రపంచలీల (1967)
నువ్వే (1967)
బ్రహ్మచారి (1967)
సుఖదుఃఖాలు (1967)
అదృష్టవంతులు (1968)
కోయంబత్తూరు ఖైదీ (1968)
తిక్క శంకరయ్య (1968)
దోపిడీ దొంగలు (1968)
నిలువు దోపిడి (1968)
పూలపిల్ల (1968)
పెళ్ళంటే భయం (1968)
పోస్టుమన్ రాజు (1968)
బాగ్దాద్ గజదొంగ (1968)
శ్రీరామకథ (1968)
ఆదర్శ కుటుంబం (1969)
కథానాయకుడు (1969)
కదలడు వదలడు (1969)
కొండవీటి సింహం (1969)
పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
ఆలీబాబా 40 దొంగలు (1970)
కోటీశ్వరుడు (1970)
గండికోట రహస్యం (1970)
మేమే మొనగాళ్లం (1971)
శ్రీకృష్ణ విజయం (1971)
శ్రీకృష్ణసత్య (1971)
భార్యాబిడ్డలు (1972)
డాక్టర్ బాబు (1973)
దేవుడమ్మ (1973)
దేవుడు చేసిన మనుషులు (1973)
లోకం చుట్టిన వీరుడు (1973)
ప్రేమలు – పెళ్ళిళ్ళు (1974)
నాయకుడు – వినాయకుడు (1980)