Jayakrishna Ghattamaneni : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు అయిన జయకృష్ణ ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో జయకృష్ణ తో పాటు అతని తల్లి మృదుల పాల్గొన్నారు. ఆల్ ఇండియా కృష్ణా, మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షుడు ఖాదర్ గోరి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో భారీ కేక్ కట్ చేసి జయ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఖాదర్ గోరి జయ కృష్ణకు భారీ గజమాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఖాదర్ గోరి మాట్లాడుతూ, “అభిమానులందరూ జయ కృష్ణ సినిమా రంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానులందరి తరపున జయ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.  జయ కృష్ణ మాట్లాడుతూ, “త్వరలోనే నా నటనా ప్రయాణం ప్రారంభం కానుంది. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తాతగారి అభిమానులు, నాన్నగారి అభిమానులు, బాబాయ్ గారి అభిమానులందరికీ ధన్యవాదాలు” అని అన్నారు.

జయ కృష్ణ తల్లి మృదుల మాట్లాడుతూ, “కొన్ని కథలు విన్నాము. అందరం కలిసి ఒక కథను ఓకే చేసి, మంచి బ్యానర్ లో మంచి సినిమాతో జయ కృష్ణను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని” తెలిపారు. ఈ వేడుకలో కృష్ణా మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షుడు ఖాదర్ గోరి, మహేష్ కృష్ణ సేన అధ్యక్షులు మల్లేష్ మరియు శ్రీధర్, నల్గొండ నరసింహ, SAC వినోద్, కిరణ్, ఎక్స్ రోడ్ నుండి హరీష్, వసంత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!